సూర్యాపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదంలో డాక్టర్ దుర్మరణం
రిపోర్టర్: గోపి
స్థలం: Suryapet
సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై పిళ్లలమర్రి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం మమతా ఆసుపత్రి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ కాకుర్తి జగదీష్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి సజీవదహనమయ్యారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదానికి నిద్రమత్తే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.