అమెరికాలో శంకర నేత్రాలయ సేవా కార్యక్రమం: ఘనంగా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ వేడుక

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Arkansas

పేదలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందించే లక్ష్యంతో అమెరికాలోని ఆర్కాన్సాస్లో శంకర నేత్రాలయ విభాగం ఆధ్వర్యంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్ కార్యక్రమం నిర్వహించినట్లు ఉపాధ్యక్షుడు వైద్యనాథన్ వెంకటసుబ్రమణియన్ తెలిపారు. బెంటన్విల్లో జరిగిన ఈ వేడుకకు సుమారు నూట యాభై మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, సంగీత వేడుకలు ఆకట్టుకున్నాయని, అడాప్ట్ ఎ విలేజ్ పథకానికి బాపూజీ వక్కలగడ్డ తొలి దాతగా ముందుకు వచ్చారని ఆయన వెల్లడించారు.