అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణ ప్రణాళికల్లో కీలక మార్పులు: భారీగా తగ్గిన వ్యయం

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రణాళికల్లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు కీలక మార్పులు చేశారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని తగ్గించే దిశగా ప్రణాళికలను సవరించి, మొత్తంగా పదిహేడు చోట్ల ఇంటర్ఛేంజ్లను ఖరారు చేసినట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు వెల్లడించారు. ఈ సవరణల ఫలితంగా ప్రాజెక్ట్ వ్యయం ఏకంగా ఏడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు భారీగా తగ్గినట్లు స్పష్టమవుతోంది.