విజయనగరంలో అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయనగరం
విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం ప్రారంభమైన ఊరేగింపు కోట వరకు మూడు సార్లు సాగింది. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ఉత్తరాంధ్రతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరయ్యారు.