పాకిస్థాన్ క్రికెట్‌లో తీవ్ర సంక్షోభం, ఏడుగురు ఆటగాళ్ల తొలగింపు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: England

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. దారుణ ఓటమిల నేపథ్యంలో పీసీబీ ఏడుగురు ఆటగాళ్లను ఇంటికి పంపించి, కోచింగ్ సిబ్బందిని మార్చింది. అంతేకాకుండా ఆటగాళ్ల ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణకు ఆదేశించడంతో మ్యాచ్ ఫిక్సింగ్ కోణం తెరపైకి వచ్చింది. ఇంగ్లండ్‌లో 2010లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది.