వకీల్ సాబ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఐదు కోట్ల పారితోషికం వదులుకున్నారు

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

వకీల్ సాబ్ సినిమా నిర్మాణ సమయంలో కరోనా పరిస్థితుల వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకుని తనకు రావాల్సిన ఐదు కోట్ల రూపాయల పారితోషికాన్ని పవన్ కళ్యాణ్ వదులుకున్నారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్‌లో జరిగిన ది పారడైజ్ ప్రీ రిలీజ్ వేడుకలో వెల్లడించారు. నిర్మాత కష్టాలను గుర్తించి పవన్ తన రెమ్యునరేషన్ వెనక్కి తీసుకోవడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని దిల్ రాజు కొనియాడారు.