నాచారంలో తుపాకి గురిపెట్టిన కేసు నిందితుడు పోలీసుల కస్టడీ నుంచి పరారీ

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేష్ కుమార్ సింగ్పై తుపాకితో దాడి చేసిన కేసులో నిందితుడు సందీప్ కుమార్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. బీహార్లో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలిస్తుండగా, సెప్టెంబర్ 4న మధ్యప్రదేశ్ కట్నీ ప్రాంతంలో ఎస్కార్ట్ నుంచి ఏ-3 నిందితుడు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.