తెలుగులో విడుదల కానున్న కీర్తి సురేష్ డోరతి చిత్రం
రిపోర్టర్: మహేష్
స్థలం: చెన్నై
తమిళంలో మంచి ఆదరణ పొందిన క్రైమ్ డ్రామా 'డోరతి' సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రానాకు చెందిన స్పిరిట్ మీడియా సంస్థ తెలుగు హక్కులను దక్కించుకుంది. కులం, హింస నేపథ్యంలో సాగే ఈ గ్రామీణ కథాచిత్రం అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుందని చిత్ర బృందం స్పష్టం చేసింది.