విశాఖలో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం: ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు

రిపోర్టర్: రాజేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం గోపాలపట్నంలోని తొంబై రెండవ వార్డు ఎస్వీఎల్ఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జీవీఎంసీ సాధారణ నిధులు ఒక కోటి ఇరవై రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలతో అభివృద్ధి చేసిన అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాకింగ్ ట్రాక్, బాక్స్ క్రికెట్, పికిల్ బాల్ కోర్టులతో పాటు పలు క్రీడా వసతులను అందుబాటులోకి తెచ్చినట్లు గణ బాబు విశాఖపట్నం వెల్లడించారు.