'జలాశయాల్లో అడుగంటిన నీరు': ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర తాగునీటి కొరత ముప్పు
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
తీవ్ర ఎల్‌నినో ప్రభావం కారణంగా శ్రీశైలం, తుంగభద్ర జలాశయాల్లో నీటి మట్టాలు దారుణంగా పడిపోయాయని, గత 40 ఏళ్లలో శ్రీశైలానికి ఈ స్థాయిలో తక్కువ ప్రవాహాలు రావడం నాలుగోసారేనని అమరావతి వర్గాలు వెల్లడించాయి. రాయలసీమ వ్యాప్తంగా తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల కింద లక్షలాది ఎకరాల ఆయకట్టులో సాగు పూర్తిగా నిలిచిపోయిందని, వచ్చే ఏడాది జూన్ వరకు కేవలం తాగునీటి అవసరాలకే నీటిని నిల్వ చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.