కావలి టిడ్కో కాలనీలో పేద రోగులకు బాసటగా నిలిచిన ఉచిత మెగా వైద్య శిబిరం
రిపోర్టర్: sujith reddy
స్థలం: కావలి
నెల్లూరు జిల్లా కావలి పట్టణం మద్దూరుపాడు టిడ్కో అపార్ట్మెంట్ల వద్ద సక్షమ్ మరియు అమ్మానాన్న సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. జయభారత్ హాస్పిటల్ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో కంటి, దంత వైద్య నిపుణులు పాల్గొని రోగులకు సేవలు అందించారు. మంగళగిరి వేణుగోపాల్ తన తండ్రి వర్ధంతి సందర్భంగా రోగులకు, సిబ్బందికి భోజన వసతి కల్పించి దివ్యాంగుల దరఖాస్తులు స్వీకరించారు.