రైతన్నలకు షాక్: రెండో పంట సాగు చేయొద్దని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులలో నీటి నిల్వలు లేనందున రైతులు రెండో పంట వేసుకోవద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎంత ఖర్చు పెట్టినా ప్రస్తుతం సాగునీరు, విద్యుత్ లభించే పరిస్థితి లేదన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైతన్నలు అందరూ ప్రభుత్వానికి, అధికారులకు తగిన సహకారం అందించాలని మంత్రి కోరారు.