నిధులున్నా ముందుకు సాగని పెదంకలాం కాలువ ఆధునికీకరణ పనులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: పార్వతీపురం మన్యం
పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, విజయనగరం జిల్లా వంగర మండలాల్లోని 21 గ్రామాల పరిధిలో ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరందించే పెదంకలాం కాలువ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.14 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ, 2022లో ప్రారంభించిన పనులు కేవలం కిలోమీటరు మేర మాత్రమే పూర్తయ్యాయి. ఆనకట్ట వద్ద షట్టర్లు దెబ్బతిని నీరు వృథాగా పోతుండటంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.