సినిమా ప్రియులకు గుడ్ న్యూస్: అవెంజర్స్ డూమ్స్‌డే కొత్త పోస్టర్లు విడుదల
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
మార్వెల్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం అవెంజర్స్ డూమ్స్‌డే సినిమాకు సంబంధించి ఐదు సరికొత్త పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసిందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో మార్వెల్ సినీ విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ప్రతినాయకులలో ఒకరైన డాక్టర్ డూమ్‌ను ప్రధానంగా చూపించారు. ఈ సినిమా 2026 డిసెంబర్ 17న భారతదేశంలోని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.