యాదాద్రి శ్రీవారి హుండీకి బుధవారం పద్నాలుగు లక్షల ఆదాయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి బుధవారం వివిధ విభాగాల ద్వారా మొత్తం పద్నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట నలభై ఆరు రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. ప్రధాన బుకింగ్, బ్రేక్ దర్శనాలు, వ్రతాలు, వీఐపీ దర్శనాలు, కార్ పార్కింగ్, ప్రసాద విక్రయాలు మరియు లీజుల ద్వారా ఈ భక్తుల కానుకలు సమకూరాయని ఆయన వివరాలు వెల్లడించారు.