భక్తిశ్రద్ధలతో ఘనంగా శ్రావణమాస ముగింపు వేడుకలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని మేదరివాడలో గల శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా భగవద్గీత పారాయణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లోని హనుమాన్ దేవాలయంలో శివుని విగ్రహానికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళా భక్తులు అమ్మవారి సన్నిధిలో భగవద్గీత పారాయణం చేసి భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో దాతలు భక్తులకు భారీగా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.