రూ. 30 కోట్లతో ఏదులాపురం రూపురేఖలు మార్చేందుకు రంగంలోకి కలెక్టర్ దివాకర
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం రూరల్
ఏదులాపురం మున్సిపాలిటీలో రూ.30 కోట్ల విలువైన అభివృద్ధి పనులు వారం రోజుల్లో ప్రారంభమయ్యాయని కలెక్టర్ దివాకర టీ.ఎస్ తెలిపారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేకంగా ఇంజినీరింగ్ అధికారులను నియమించామని ఆయన వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేలా వేగంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని స్పష్టం చేశారు.