హైలో ఓపెన్ టోర్నమెంట్ విజేతలుగా లక్ష్య సేన్, పీవీ సింధు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల, మహిళల సింగిల్స్ టైటిళ్లను భారత్ కైవసం చేసుకోవడం పట్ల కేంద్ర మంత్రి G Kishan Reddy హర్షం వ్యక్తం చేశారు. పురుషుల విభాగంలో లక్ష్య సేన్ ఇండోనేషియా ఆటగాడిపై విజయం సాధించగా, మహిళల విభాగంలో పీవీ సింధు ఛాంపియన్గా నిలిచారని ఆయన తెలిపారు. ఈ అద్భుత విజయం సాధించిన క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ, దేశానికీ కీర్తి ప్రతిష్టలు తెచ్చారని పేర్కొన్నారు.