వాయుగుండం వర్షాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ సమీక్ష
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
తీవ్ర వాయుగుండం ప్రభావంపై జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. శ్రీకాకుళంలో దెబ్బతిన్న వరి పంటను అంచనా వేయాలని, ప్రజలకు తాగునీరు, ఆహారం, వైద్యం అందించడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.