వైకాపాపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు
రిపోర్టర్: అశోక్
స్థలం: విశాఖపట్నం
ప్రజలపై వైకాపా నేతలది బూటకపు ప్రేమ అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో తెలిపారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మద్యం కుంభకోణానికి రాజ్ కెసిరెడ్డే కర్త, కర్మ, క్రియ అని స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని, జగన్ వద్ద తనను దుర్మార్గుడిగా చిత్రీకరించారని ఆరోపించారు. త్వరలో కొత్త పార్టీ పేరు ప్రకటించి పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. విశాఖ రాజధాని విషయంలో వైకాపా మాట మార్చిందని విమర్శించారు.