గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీఆర్ఎస్ అభ్యర్థులు: కాసాని, రాకేష్ రెడ్డి పేర్లు ఖరారు
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం నుంచి కాసాని వీరేష్ ముదిరాజ్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలించి ఫైనల్ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పాలనను ఎదిరించేందుకు ఈ ఇద్దరు నేతల ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తమకు ఓట్లను కురిపిస్తుందని గులాబీ పార్టీ అగ్రనేతలు గట్టిగా నమ్ముతున్నారు.