హైదరాబాద్లో ఎల్ నినో ప్రభావం: అక్టోబరులోనూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తీవ్ర ఉష్ణోగ్రతలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో ఎల్ నినో ప్రభావంతో అక్టోబరు ముగుస్తున్నప్పటికీ తీవ్రమైన వేడి వాతావరణం కొనసాగుతోందని డాక్టర్ హర్ష వెల్లడించారు. పగలు రాత్రి తేడా లేకుండా ఉక్కపోతలు పెరుగుతుండటంతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి రోగులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. డయేరియా, టైఫాయిడ్ కేసులు అధికమవుతున్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.