మహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత మహిళా క్రికెటర్ల నిరాకరణ
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి టైటిల్ గెలుచుకున్న భారత మహిళా జట్టు, ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి నుంచి ట్రోఫీ తీసుకోబోమని, పురుషుల జట్టు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా స్పష్టం చేశారు.