గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న వేముల వీరేశం
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
రామన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సాగునీటి కాల్వల అభివృద్ధికి, రోడ్ల మరమ్మతులకు తగిన నిధులు మంజూరు చేయిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.