నిరుపేద మహిళలకు తీపి కబురు: అన్ని కేటగిరీల పింఛన్లకు వర్తింపు

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

భర్త మరణిస్తే చేయూత పింఛనుదారుల కుటుంబాలకు తక్షణమే ఆర్థిక భరోసా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు వృద్ధాప్య పింఛన్లకు మాత్రమే ఉన్న ఈ వెసులుబాటును దివ్యాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, డయాలసిస్ బాధితులందరికీ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లోగా పరిశీలన పూర్తిచేసి ఆ మరుసటి నెల నుంచే లబ్ధిదారుల ఖాతాల్ లో పింఛన్ నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.