నర్సీపట్నం మున్సిపల్ పీఠంపై ఏకపక్షంగా నామినేషన్ వేసి జనసేన కలకలం

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో జనసేన పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అద్దేపల్లి సౌజన్య ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కూటమిలో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేస్తూ అభ్యర్థి తరఫు నాయకులు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. స్థానిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పరిణామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.