రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేసిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సమయానికి అందిన రైతుబంధు నిధులు నేడు కరవయ్యాయని వాపోయారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.