దశాబ్దాల పోరాటాల ఫలితంగా త్వరలోనే బందరు పోర్టు సాకారం

రిపోర్టర్: సునీల్ స్థలం: కృష్ణా

దశాబ్దాల పాటు పోరాటాలు చేసి, ఎన్నో ఉద్యమాలు నిర్వహించి సాధించుకున్న బందరు పోర్టు త్వరలోనే పూర్తిగా సాకారం కాబోతోందని గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తీర ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కల సాకారమవుతుండటంతో నియోజకవర్గ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని, త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.