సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ సినిమా విడుదల
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, నివేదా పెతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.