వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళ దారుణ హత్య
రిపోర్టర్: విజయ్
స్థలం: తిరుపతి జిల్లా
తిరుపతి జిల్లా కోటలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం అనుమానంతో నాగభూషణమ్మను నిందితురాలు యశోదమ్మ అర్ధరాత్రి దారుణంగా హత్య చేసి నగలు, డబ్బులతో పరారైంది. పొదలకూరులో తలదాచుకున్న నిందితురాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలో మరో వ్యక్తి ప్రమేయంపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నారు.