టికెట్ ధరలు పెంచవద్దు: ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం విజ్ఞప్తి

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయవాడ

విజయవాడలో ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం సమావేశమైంది. టికెట్ ధరలు పెంచితే సామాన్యులకు వినోదం దూరమవుతుందని, థియేటర్ల మనుగడ కష్టమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ధరలు పెంచే జీవోలు ఇవ్వొద్దని కోరారు. పెద్ద సినిమాల సమయంలో రేట్లు పెంచక తప్పదని ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్ పేర్కొనగా, ఎగ్జిబిటర్లు తమ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. థియేటర్ల మనుగడ కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేశారు.