యువతను ఆకట్టుకునేలా సుచిత్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫీల్ గుడ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

సుచిత్, అదితి త్రిపాఠి జంటగా దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఫీల్ గుడ్ అని మేకర్స్ తెలిపారు. విశ్వరూప ఫిల్మ్స్ పతాకంపై సుచిత్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఇటీవల విడుదల చేసిన మమ్మా మియా గీతం అందరిని ఆకట్టుకుంటోందని చిత్ర యూనిట్ పేర్కొంది. నేటి యువతను అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందించామని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.