పోలీస్ ఉద్యోగాల కోసం భీమారంలో ఉచిత శిక్షణ ప్రారంభం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

వరంగల్ పోలీస్ కమిషరేట్ ఆధ్వర్యంలో ఉచిత పోలీస్ ఉద్యోగ కోచింగ్లో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్లో ఉత్తీర్ణులైన 560 మంది అభ్యర్థులకు శుభం ఫంక్షన్ హాల్లో మంగళవారం ముందస్తు సమావేశం నిర్వహించారు. సీపీ ఎన్. శ్వేత మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా కష్టపడితే ఉద్యోగం సాధించవచ్చని తెలిపారు. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులను ఆమె కోరారు.