అంతర్జాతీయ చమురు మార్కెట్లో భారత్ దూకుడు: రష్యా ఆయిల్‌తో భారీగా ఎగుమతులు
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
అంతర్జాతీయ చమురు మార్కెట్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక వెల్లడించింది. రష్యా నుంచి తక్కువ ధరలకు ముడి చమురును కొనుగోలు చేసి, దేశీయ రిఫైనరీల్లో శుద్ధి చేసిన తర్వాత పెట్రోలియం ఉత్పత్తులను పశ్చిమ దేశాలకు ఎగుమతి చేస్తోంది. సెప్టెంబర్‌లో భారత చమురు ఉత్పత్తుల ఎగుమతులు నూట ముప్పై మూడు శాతం పెరిగాయని, ఇందులో రిలయన్స్ రిఫైనరీ కీలక పాత్ర పోషించిందని పేర్కొంది.