హైదరాబాద్ లో పెళ్లి పేరుతో ఘరానా మోసాలు: మాయగాళ్ల ఉచ్చులో మధ్య వయస్కులు
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
మధ్య వయస్కులే లక్ష్యంగా పెళ్లి పేరిట ఘరానా మోసాలు జరుగుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. భాగస్వామి కోసం వెతికే వారిని దళారులు నమ్మించి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన ఒక స్థిరాస్తి వ్యాపారి ఏజెంట్ మోసానికి బలైనట్లు వెల్లడించారు. బాధితులు పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో మోసాలు బయటపడటం లేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.