రైల్వేకోడూరులో ఘనంగా కీర్తి మెడికల్ స్టోర్స్ నూతన ప్రారంభోత్సవం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రైల్వేకోడూరు

రైల్వేకోడూరులో కీర్తి మెడికల్ స్టోర్స్ నూతన షోరూమ్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి స్టోర్ను ప్రారంభించారు. నాణ్యమైన వైద్య ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి రావడం అభినందనీయమని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.