టెక్నాలజీ అద్భుతం: సాంప్రదాయ నృత్యంతో అందరినీ ఆకట్టుకున్న చైనా హ్యూమనాయిడ్ రోబోట్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: Riyadh
చైనా రాయబార కార్యాలయం నిర్వహించిన వేడుకలో సాంప్రదాయ దుస్తులు ధరించిన హ్యూమనాయిడ్ రోబోట్లు కత్తులతో ప్రదర్శన చేసినట్లు రాయ్ఢ్ ప్రాంత మేయర్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ అయ్యాఫ్ తెలిపారు. చైనా సాంకేతిక అభివృద్ధికి ఇవి నిదర్శనమని చైనా రాయబారి చాంగ్ హువా పేర్కొన్నారు. సాంస్కృతిక సంప్రదాయాన్ని రోబోట్లు ప్రదర్శించడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుందని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు స్పష్టం చేస్తున్నాయి.