నాగబాబుకు కేబినెట్ హోదా, సుస్మితకు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చోటు
రిపోర్టర్: విజయ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మెగా కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత పెరిగింది. జనసేన సీనియర్ నాయకుడు కొణిదెల నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో చోటు దక్కింది. కూటమి ప్రభుత్వంలో వరుసగా కీలక పదవులు లభించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.