ఓటీటీలోకి ఎంఎస్ రాజు అగధ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు తెరకెక్కించిన సూపర్ నేచురల్ మిస్టిక్ హారర్ థ్రిల్లర్ అగధ చిత్రం ఓటీటీ బాట పట్టనుంది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 దక్కించుకుంది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించనప్పటికీ, సెప్టెంబర్ 25 నుంచి జీ5 వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.