బాస్కెట్ బాల్ క్రీడాకారుడినని నమ్మించి రూ.90 వేల విలువైన కారు చోరీ

రిపోర్టర్: సునీల్ స్థలం: United States

అమెరికాలోని జార్జియాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తాను ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడినని హోటల్ సిబ్బందిని నమ్మించాడు. వాలెట్ సిబ్బందిని మోసం చేసి సుమారు 90 వేల డాలర్ల విలువైన లగ్జరీ బీఎండబ్ల్యూ కారును ఎత్తుకెళ్లాడు. సవన్నా నగరంలోని హయత్ రెజెన్సీ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. నిందితుడు ముందు రోజు మరో దొంగిలించిన ఆడి కారులో అక్కడికి వచ్చాడు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.