ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్లో రిలయన్స్ జియో భారీ వృద్ధి

రిపోర్టర్: రాము స్థలం: Amaravati

ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్లో రిలయన్స్ జియో చందాదారుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ట్రాయ్ వెల్లడించిందని టెలికాం వర్గాలు తెలిపాయి. ఆగస్టు నెలలో కొత్తగా 2.12 లక్షల మొబైల్ కనెక్షన్లు చేరడంతో మొత్తం వినియోగదారులు 3.29 కోట్లకు చేరారు. వైర్లైన్ మరియు ఎయిర్ఫైబర్ సేవల్లోనూ అద్భుతమైన వృద్ధి నమోదైందని అధికారులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్కు డిమాండ్ పెరుగుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని నిపుణులు విశ్లేషించారు.