అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్

రిపోర్టర్: కిరణ్ స్థలం: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులందరికీ పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు.