అప్పు తిరిగి ఇవ్వలేదని సెల్ టవర్ ఎక్కి కొమురయ్య ఆత్మహత్యాయత్నం
రిపోర్టర్: అశోక్
స్థలం: కరీంనగర్ జిల్లా
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన కొమురయ్య అనే వ్యక్తి తనకు అప్పుగా ఇచ్చిన ఇరవై నాలుగు లక్షల రూపాయలు తిరిగి ఇవ్వడం లేదని మనస్తాపానికి గురై శుక్రవారం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 2015లో గంగాధర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త జగిరపు శ్రీనివాస్‌కు ఈ డబ్బు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. గమనించిన స్థానికులు, పోలీసులు టవర్ వద్దకు చేరుకుని అతడిని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.