'ఆ పాట షూటింగ్‌లో భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నా': నటి తమన్నా
రిపోర్టర్: సురేష్
స్థలం: ముంబయి
అగ్ర కథానాయిక తమన్నా నటిస్తున్న తాజా మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘ది వివాన్' త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. సిద్ధార్థ మల్హోత్రా సరసన నటిస్తున్న ఈ చిత్రంలో ఛఠ్ పూజ నేపథ్యంలో చిత్రీకరించిన పాట తన కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమని, షూటింగ్ సమయంలో భావోద్వేగాలను ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నానని ఆమె తెలిపారు. దాదాపు 36 గంటల పాటు నిష్టగా చేసే ఈ పూజ తన హృదయాన్ని కదిలించిందని తమన్నా పేర్కొన్నారు.