ఢిల్లీలో తీవ్ర కాలుష్యం: నవంబర్ ఐదు నుంచి ఆంక్షలు అమలవుతాయని ప్రకటన
రిపోర్టర్: అశోక్
స్థలం: ఢిల్లీ
గాలి నాణ్యత పడిపోవడంతో ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వెల్లడించింది. మొత్తం గాలి నాణ్యత సూచిక రెండు వందల అరవై ఒకటిగా నమోదైందని, నవంబర్ ఐదు నుంచి ఇరవై వరకు ఆంక్షలు అమల్ లో ఉంటాయని అధికారులు తెలిపారు. నిర్మాణ పనులపై నిషేధంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్ లో యాభై శాతం మంది ఉద్యోగులతోనే విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.