శ్రీకాకుళం జిల్లా పోలీసు: రిటైర్డ్ హోంగార్డుకు నాలుగు లక్షల ఆర్థిక సాయం
రిపోర్టర్: రాము
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన రంపా నరసింహమూర్తికి ఆర్థిక చేయూతనిచ్చారు. ఈ నేపథ్యంలో నాలుగు లక్షల ఆరు వేల రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి బాధితుడికి అందజేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి తమ శాఖ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని, ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.