ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హైదరాబాద్‌లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు కరెంట్, సాగునీరు అందక పాత రోజులు వచ్చాయని ఆయన మండిపడ్డారు. మేడిగడ్డను బూచిగా చూపి గోదావరి నీళ్లను ఎత్తిపోయకపోవడం వల్లే జిల్లాలు ఎడారిగా మారుతున్నాయని, ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కై తెలంగాణ పొలాలను ఎండబెడుతున్నారని ఈటల ఆరోపించారు.