రాప్తాడు ఘటన: నిందితుడు హేమంత్ పై పోలీసుల కాల్పులు, తీవ్ర గాయాలు
రిపోర్టర్: శివ
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడులో బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ ఆత్మకూరు అడవుల్ లో తలదాచుకున్నాడని పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేసి పారిపోవడానికి యత్నించాడని, దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారని అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్ లో తీవ్రంగా గాయపడిన నిందితుడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.