పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆకాంక్ష

రిపోర్టర్: రమేష్ స్థలం: తాండూరు

తాండూరు మండలంలో జరగబోయే పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి చరిత్ర తిరగరాయాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం ఎల్మకన్నె సహకార సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మండలంలో రూ.110 కోట్లతో తాగ్న నది నుంచి తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కోట్పల్లి, శ్రీరాముల జలాశయాలకు మరమ్మతులు చేయిస్తున్నామని, రహదారి నిర్మాణ పనులను ఏడాదిలోగా పూర్తి చేసి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.