అనంతపురంలో ఉన్మాది హేమంత్ ఎన్కౌంటర్: పోలీసుల కాల్పుల్ లో కాళ్లకు బుల్లెట్లు
రిపోర్టర్: శివ
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడులో పదోతరగతి విద్యార్థినిపై రంపంతో దాడికి పాల్పడి పరారైన ఉన్మాది హేమంత్‌ను పోలీసులు ఆత్మకూరు అడవిలో పట్టుకునే ప్రయత్నం చేయగా, సీఐపై ఇనుప ముక్కతో దాడికి యత్నించడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపినట్లు ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. ఈ ఎదురుకాల్పుల్ లో నిందితుడి రెండు మోకాళ్ల కిందిభాగంలో ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయని, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని, దాడిలో గాయపడిన సీఐకి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.